జనసేన పార్టీలోకి చేరిన పవన్‌ కల్యాణ్ బాల్య మిత్రులు

వాస్తవం ప్రతినిధి:  జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ బాల్యమిత్రులు చన్నరాంరెడ్డి, బీఎం సతీష్‌, సమరసింహా రెడ్డిలు జంగారెడ్డిగూడెంలో ఆదివారం రాత్రి జనసేన పార్టీలో చేరారు. వీరు ముగ్గురు పవన్‌తోపాటు హైదరాబాద్‌ సెయింట్‌జోసెఫ్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ల్లో చదువుకున్నారు. వారికి పవన్‌ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ మంచితనాన్ని కొనియాడారు. జనసేన అధికారంలోకి రావడానికి తాము పూర్తి స్థాయిలో పని చేస్తామని చెప్పారు. మరోవైపు, పవన్ కల్యాణ్ ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ ముంపు మండలాల్లో పర్యటించనున్నారు. భూనిర్వాసితులతో భేటీ అవుతారు.