చంద్రన్న పెళ్లికానుక లో మార్పులు

వాస్తవం ప్రతినిధి: చంద్రన్న పెళ్లికానుకను ప్రభుత్వం మరింత విస్తరించింది. ఈ మొత్తాన్ని భారీగా పెంచి ఈ ఏడాది ఏప్రిల్‌ 20నుంచి సెప్టెంబ రు 7వ తేదీ మధ్యలో వివాహం చేసుకుని అనివార్య కారణాల వల్ల దరఖాస్తు చేసుకోని వారికి తిరిగి దరఖాస్తు చేసుకునేందు కు మరో సువర్ణావకాశమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
అక్టోబరు1నుండి 31 వరకు దరఖాస్తుకు అవకాశం ఇస్తున్నామని పేదవర్గాలకు ప్రయోజనం చేకూర్చేందుకే ఈ మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేకపోవడం వల్ల పలు నిరుపేద కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ది పొందలేకపోయారన్నారు. అందువల్ల సెప్టెంబరు 30వరకు ఆన్‌లైన్‌ నమోదు చేసుకోలేకపోయిన అభ్యర్థులకు సిఎం ఆదేశాల మేరకు మరో అవకాశం కల్పింస్తున్నామని తెలిపారు.