సునామీ కారణంగా జైళ్ళ నుంచి తప్పించుకున్న 1200 మంది ఖైదీలు

వాస్తవం ప్రతినిధి:  ఇండోనేషియాలోని సులవెసి ద్వీపంలో సంభవించిన భారీ భూకంపం కారణంగా తీవ్ర విధ్వంశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సునామీ కారణంగా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 800 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అయితే భీభత్సం కారణంగా ద్వీపంలోని మూడు జైళ్లు ద్వంసం కావడం తో దాదాపు 1200 మంది ఖైదీలు తప్పించుకున్నట్లు ఆ దేశ న్యాయ శాఖ మంత్రి వెల్లడించారు. సునామీ సంభవించిన పాలూ నగరంలో జైలు గోడలు కూలిపోవడంతో ఖైదీలు అక్కడి నుంచి పారిపోయినట్లు ఆయన వివరించారు. భారీగా నీరు జైల్లోకి ప్రవేశించడంతో భయాందోళనలకు గురైన ఖైదీలు అక్కడి నుంచి రోడ్లమీదికి పరుగులు తీశారని మంత్రి చెప్పారు. పాలూ నగరంలోని రెండు జైళ్లలో కేవలం వంద మంది మాత్రమే ఖైదీలు ఉన్నట్లు మంత్రి స్పష్టంచేశారు. అయితే సునామీ విలయం కారణంగా భారీ నష్టం జరగడంతో అక్కడి భద్రతా సిబ్బంది ఖైదీలకు ఆహారం అందించేందుకు చాలా కష్టపడాల్సి వస్తోందని, అక్కడ ఎక్కువ రోజులు ఆహారం దొరికే పరిస్థితి కూడా లేదని తెలిపారు.