స్నేహితుడి తల తో స్టేషన్ లో లొంగిపోయిన వ్యక్తి

వాస్తవం ప్రతినిధి: కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఓ వ్యక్తి తన స్నేహితుడి తల నరికి, అలాగే వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అయితే తన తల్లిని లైంగికంగా వేధించాన్న కోపంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆ వ్యక్తి పేరు పశుపతి కాగా.. అతని చేతిలో హతమైన స్నేహితుడి పేరు గిరీశ్. నెల రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోసారి కావడం విశేషం. ఇక గత గురువారం అజీజ్ ఖాన్ అనే వ్యక్తి శ్రీనివాసపురలో తను సంబంధం పెట్టుకున్న మహిళ తల నరికి అలాగే పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. అయితే ఇప్పుడు తన తల్లిని వేధిస్తున్నాడన్న కారణంగా ఈ విధంగా తన స్నేహితుడి తల నరికి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.  ఈ నెల మొదట్లో చిక్‌మంగళూరు పోలీస్ స్టేషన్‌లో ఇలాంటిదే మరో ఘటన జరిగింది. తన భార్య మరో వ్యక్తితో సంబంధం పెట్టుకున్నదంటూ అతడు ఈ దారుణానికి ఒడిగట్టాడు.