కనీసం కోటి పరిహారం అడుగుతున్న తివారి భార్య

వాస్తవం ప్రతినిధి: ఉత్తర ప్రదేశ్‌లో శనివారం దారుణం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కారు ఆపని కారణంగా యాపిల్‌ సంస్థ మేనేజర్‌ వివేక్‌ తివారి ని పోలీస్ కానిస్టేబుల్ కాల్పులు జరపడం తో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌పై పెద్ద దుమారమే చెలరేగుతోంది. రాష్ట్రంలో జరుగుతున్న బూటకపు ఎన్‌కౌంటర్లకు బాధ్యత వహిస్తూ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ రాజీనామా చేయాలని సమాజ్‌ వాదీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీ వాల్ డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా ప్రభుత్వానికి వారి కుటుంబం నుంచి ఊహించని షాక్‌ తగిలింది. పోలీసుల కాల్పుల్లో మరణించిన వివేక్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు రాష్ట్ర మంత్రులు బ్రజేష్‌ పాఠక్‌, అశుతోష్‌ టాండన్‌లు ఆదివారం వారి ఇంటికి వెళ్లారు. ప్రభుత్వం తరుఫున నుంచి రూ. 25 లక్షల నష్టపరిహరం అందిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి వివేక్‌ కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు 25 లక్షలు అవసరం లేదని.. కోటి పరిహారం కావాలని అతని భార్య కల్పన డిమాండ్‌ చేశారు. తమ కుటుంబమంతా వివేక్‌పైనే అధారపడి ఉందని.. పోలీసులు అక్రమంగా కాల్చి చంపారని, తమ పిల్లల భవిష్యత్తు  ఏంటని ఆమె ప్రశ్నించారు. సీఎం యోగి ఆదిత్యా ఇక్కడి వచ్చి తమకు సమాధానం చెప్పే వరకు మృత దేహానికి దహన సంస్కారాలు కూడా నిర్వహించమని ఆమె తేల్చి చెప్పారు.