తిరుచురాపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది మృతి

వాస్తవం ప్రతినిధి: తమిళనాడు రాష్ట్రంలోని తిరుచురాపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై ఆగి ఉన్న లారీని స్కార్పియో వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈఘటనలో 8 మంది మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి. సమచారం అందుకొని ఘటనా స్థలికి చేరుకొన్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు సమాచారం.