832 కి చేరిన మృతుల సంఖ్య

వాస్తవం ప్రతినిధి: ఇండోనేషియాలోని సులవేసి దీవిలో సంభవించిన సునామీ విధ్వంసానికి మృతిచెందిన వారి సంఖ్య నేటికి మరింత పెరిగింది. దీనితో ఈ సునామీ విధించిన విధ్వంశం కి మృతి చెందిన వారి సంఖ్య 832 ఐ చేరినట్లు ఆదేశ విపత్తు నిర్వహణ అధికారులు తాజాగా వెల్లడించారు. ఓవైపు శక్తివంతమైన భూకంపం.. మరోవైపు సునామీ విరుచుకుపడటంతో ఎక్కువ మంది మృత్యువాత పడ్డారు. భారీగా ప్రాణ.. ఆస్తినష్టం జరిగిందని.. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు చెబుతున్నారు. జాతీయ విపత్తు నిర్వహణ సిబ్బంది, సైన్యం సహాయక చర్యల్లో పాల్గొన్నారు. చాలా మంది ప్రజలు గల్లంతుకాగా.. ఎక్కువ సంఖ్యలో మృతదేహాలు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. దీనితో స్థానిక ఆస్పత్రుల్లన్నీ గాయపడినవారితో నిండిపోయాయి.  మృతదేహాల వెలికితీత కొనసాగుతుందని అంతిమంగా మృతుల సంఖ్య వేలల్లో ఉంటుందని ఇండోనేషియా వైస్‌ప్రెసిడెంట్ జుసుఫ్ కల్లా తెలిపారు. సునామీని జాతీయ విపత్తుగా ప్రకటించిన ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఇవాళ బాధిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. సులవేసిలో శుక్రవారం మధ్యాహ్నం రిక్టర్‌స్కేల్‌పై 7.5 తీవ్రతతో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే.