మరోసారి కిమ్ ని పొగిడిన ట్రంప్

వాస్తవం ప్రతినిధి: ఒకప్పుడు ఉప్పు,నిప్పుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్,ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ ల మధ్య తీరు ఇప్పుడు మారిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పడు మాత్రం ట్రంప్ ఎక్కడ బడితే అక్కడ కిమ్ ని తెగ పొగిడేస్తున్నారు. శనివారం రిపబ్లిక్‌ పార్టీ మద్దతుగా జరిగిన ర్యాలిలో పాల్గొన్న ట్రంప్‌ కిమ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. కిమ్‌ తనకు అందమైన లెటర్స్‌ రాశాడని, అవి గొప్ప లెటర్స్‌ అని, తామిద్దరం ఇప్పుడు ప్రేమలో పడ్డామని చెప్పుకొచ్చాడు. ఇక గత సోమవారం ఐక్యరాజ్య సమితిలో డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తు కిమ్‌ను కొనియాడాడు. గతేడాది ఈయనే ఇదే కార్యాలయంలో కిమ్‌ మానవ హక్కులను ఉల్లంఘించాడని మండిపడిన విషయం తెలిసిందే. తనతో రెండోసారి భేటీ అవ్వాలని కోరుతూ ట్రంప్‌కు కిమ్‌ లేఖ పంపించిన నేపథ్యంలో ట్రంప్‌, కిమ్‌ను కొనియాడుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కొన్ని దశాబ్దాలుగా బద్దశత్రువులుగా ఉన్న అమెరికా, ఉత్తరకొరియాలు చర్చల బాట పట్టడం తెల్సిందే. ఇందులోభాగంగా గత జూన్‌లో సింగపూర్‌లో ట్రంప్, కిమ్‌ల మధ్య చారిత్రక సమావేశం జరిగిన విషయం తెలిసిందే.