భారత్-వెస్టిండీస్ ల మధ్య టికెట్ల వివాదం

Indore: Groundsmen cover the ground at Holkar Cricket Stadium during rains in Indore on Friday. PTI Photo by Atul Yadav (PTI9_22_2017_000138B)

వాస్తవం ప్రతినిధి: భారత్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య ఇప్పుడు టికెట్ల వివాదం చోటుచేసుకుంది. దీనితో ఈ రెండు జట్ల మధ్య అక్టోబర్‌ 23న జరిగే రెండో వన్డే వేదిక ఇండోర్‌ నుంచి మరో చోటికి తరలించే అవకాశం కనిపిస్తోంది. కాంప్లిమెంటరీ పాస్‌ల విషయంలో బీసీసీఐ, మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం మధ్య వివాదం చోటు చేసుకోవడమే ఇందుకు కారణం. బీసీసీఐ కొత్త రాజ్యంగం ప్రకారం స్టేడియంలోని మొత్తం టికెట్లలో 90 శాతం విక్రయానికి ఉంచాలి. అంటే కేవలం 10 శాతం కాంప్లిమెంటరీ పాస్‌లు మాత్రమే రాష్ట్ర సంఘం వద్ద ఉంటాయి. హోల్కర్‌ స్టేడియం సామర్థ్యం 27,000. అంటే 2,700 మాత్రమే కాంప్లిమెంటరీ పాస్‌లు. ప్రకటనదారులు, ప్రాయోజితదారుల కోసం బీసీసీఐ ఈ కోటాలో భాగం అడుగుతుండటమే వివాదానికి కారణం. బీసీసీఐ తమ డిమాండ్‌ను వెనక్కి తీసుకోకపోతే ఇండోర్‌లో రెండో వన్డే నిర్వహించడం సాధ్యంకాదని ఎంసీఏ సంయుక్త కార్యదర్శ మిలింద్‌ కన్మదికర్‌ స్పష్టం చేశారు.