మహేష్ బాబుది ఎంత మంచి మనసో ..

వాస్తవం సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ హీరోగా కీర్తిని సంపాదిస్తూనే సమాజం పట్ల తన వంతు భాద్యతను కూడ నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం హీల్ చైల్డ్ పేరుతో చిన్న పిల్లలకు ఉచితంగా వైద్యం అందించే ఒక ఛారిటీని నడుపుతున్నారు. అలాగే గ్రామాల్లో పాఠాశాల వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ది గ్రామమ్ ఫౌండేషన్ ను కూడ రన్ చేస్తున్నారు.

వీటి ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆయన వాటి నిర్వహణ కోసం నిధులు సేకరించేందుకు అక్టోబర్ 27న అమెరికాలోని న్యూయార్క్ లో యాన్ ఈవెనింగ్ విత్ మహేష్ బాబు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీని ద్వారా వచ్చిన నిధుల్ని ఆయన తన స్వచ్ఛంద సంస్థల ద్వారా సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నారు. ఈ వార్త తెలిసిన అభిమానులంతా మా మహేష్ బాబుది ఎంత మంచి మనసో అనుకుంటున్నారు.