బిగ్ బాస్ 2 ఫైనల్ ఫినాలే లో వెంకటేష్ అదిరిపోయే స్పీచ్ ఇచ్చాడట!

వాస్తవం సినిమా: తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 2 సీజన్ నేటితో పూర్తి అవుతుంది. వాస్తవానికి వంద రోజులు అని చెప్పినప్పటికీ మరో వారం పొడిగించారు. ఈసారి బిగ్ బాస్ హౌజ్ పదిహేడు మందితో కొనసాగింది.
నేటితో బిగ్ బాస్ సీజన్-2 ముగియనుంది. నేడు ఫైనల్ ఫినాలే జరుగనుండగా, ఆ ఎపిసోడ్ ను నిన్ననే ‘స్టార్ మా’ యాజమాన్యం చిత్రీకరించగా, షోలో ప్రేక్షకులుగా పాల్గొన్న యువతీ యువకుల నుంచి ఎన్నో లీక్ లు వస్తున్నాయి. ఇలాంటి లీకేజ్ లు జరగకుండా ఎన్ని జాగ్రత్తలు పడుతున్నా లీకేజ్ లు మాత్రం ఆగడం లేదు. ఈ గ్రాండ్ ఫినాలేలో విజేతను తొలి సీజన్ హోస్ట్ ఎన్టీఆర్ ప్రకటిస్తారని తొలుత ఊహాగానాలు వచ్చినప్పటికీ, నిన్న సెట్స్ కు వచ్చింది ఆయన కాదట. విక్టరీ వెంకటేష్ వచ్చి, బిగ్ బాస్ సీజన్-2 విజేతను స్వయంగా ప్రకటించారని, ఈ సందర్భంగా ఆయన అదిరిపోయే స్పీచ్ ఇచ్చారని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. బిగ్ బాస్ విజేతగా కౌశల్ ను ప్రకటించింది వెంకటేష్ అని తెలుస్తుండగా, అసలు కార్యక్రమం చూసేందుకు మాత్రం నేటి రాత్రి వరకూ ఆగాల్సిందే.