‘దేవదాస్’లోని డిలీటెడ్ సీన్ రిలీజ్ చేసిన నాని

వాస్తవం సినిమా: అక్కినేని నాగార్జున, నేచురల్ స్టార్ నాని హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ దేవదాస్. ఇటీవలే రిలీజ్ అయిన ఈ మూవీ మంచి సక్సెస్ టాక్‌తో నడుస్తోంది. అయితే ఈ చిత్రంలోని డిలీట్ చేసిన ఓ సీన్ ను నాని తన అభిమానులతో పంచుకున్నాడు. అది నాని హాస్పిటల్ సీన్. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో జరుగుతున్న మోసాల నేపథ్యంలో ఈ సన్నివేశాన్ని తెరకెక్కించగా, రావురమేశ్ తో వాదనకు దిగే సీన్ ఇది. ఈ సీన్‌లో నాని ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ చూపించనంత ఎమోషన్‌ని చూపించాడు.

విపరీతమైన ఆవేశంతో సహనాన్ని కోల్పోయిన క్షణంలో మనిషి ఎలా ప్రవర్తిస్తాడో ఈ సీన్‌లో నాని స్పష్టంగా చూపించారు. రావు రమేష్ నానిని ఉద్యోగం నుంచి తొలగించే సీన్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ సీన్‌లో రావు రమేష్… నానిని అవమానిస్తూ మాట్లాడటం… అనంతరం అక్కడే ఉన్న తోటి ఉద్యోగులు కూడా అవహేళన చేయడంతో బాగా నొచ్చుకుంటాడు నాని. దీంతో నాని చాలా ఆవేశంగా మాట్లాడతాడు. ప్రస్తుతం ఈ సీన్ ప్రేక్షకులను నెట్టింట్లో బాగా ఆకట్టుకుంటోంది.