సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు

వాస్తవం ప్రతినిధి: బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.  నేతాజీ సుభాష్‌ చంద్ర బోస్‌ హత్యకు గురయ్యారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అందరూ అనుకున్నట్లుగా 1945 లో జరిగిన విమాన ప్రమాదం లో మృతి చెందలేదని, ఆయనను అప్పటి రష్యా అధ్యక్షుడు జోసఫ్‌ స్టాలిన్‌ హత్య చేయించారంటూ సంచలన ఆరోపణలు చేశారు.  శనివారం అగర్తల లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నేతాజీ కమ్యూనిస్టు రష్యాలో ఆశ్రయం పొందారని, అయితే ఆయన అక్కడ హత్యకు గురయ్యారని ఆరోపణలు చేశారు.