“పశ్చిమ” లో పవన్ పై సరికొత్త “పచ్చ” కుట్ర…??

వాస్తవం ప్రతినిధి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి పశ్చిమగోదావరి ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు.టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు చేస్తున్న అక్రమాలపై..అభివృద్దికి నోచుకోని నియోజకవర్గాల సమస్యలపై తనదైన తీరిలో స్పందిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రజా ఓటు తో నెగ్గి పాలనని అటకెక్కిస్తున్న ప్రజా ప్రతినిధులపై తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు..ఈ క్రమంలోనే పవన్ చింతమనేని ప్రభాకర్ పై ఎక్కుపెట్టిన పవనాస్త్రం ఏపీలోనే సంచలనం అయ్యింది..ఇప్పటివరకూ చింతమనేని పై మాట్లాడాలంటే సొంతపార్టీ కీలకనేతలకే వణుకు అలాంటిది చింతమనేని ఒక ఆకు రౌడీ అంటూ చేసిన వ్యాఖ్యలతో టీడీపీ పార్టీ ఒక్క సారిగా షాక్ అయ్యింది.

అంతేకాదు పశ్చిమలో టీడీపీ గెలిచే మొదటి టిక్కెట్టు దెందులూరు అంటూ మురిసిపోయే బాబు కి షాక్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. పవన్ దెబ్బతో పశ్చిమలో టీడీపీ ఓడిపోయే మొదటి సీటు దెందులూరు అనేవిధంగా మారిపోయాయి పరిణామాలు..అయితే ఈ ఊపు ఇలాగే కొనసాగితే పశ్చిమలో టీడీపీకి నూకలు లేకుండా పోతాయని గ్రహించిన టీడీపీ పెద్దలు పవన్ కళ్యాణ్ స్పీడుకు బ్రేకులు వేసేపనిలో పడ్డారట..అందుకోసం ఒక పక్కా వ్యూహాన్ని సిద్దం చేశారని టాక్ వినిపిస్తోంది..ఇంతకీ ఏమిటా స్కెచ్ అంటే

పవన్ ఒక అసాంఘిక శక్తి..పవన్ కుల పిచ్చి ఉన్న నాయకుడు..కాపులకే అధికంగా ప్రాధాన్యత ఇస్తున్నాడు…పార్టీలో కీలక నేతలు సైతం పవన్ వల్ల అవమానాలు పడుతున్నారు..మాటలతో విద్వేషాలు రెచ్చగొట్టేలా పవన్ వ్యాఖ్యలు చేస్తున్నాడు అతడికి ఎలాంటి మతం అన్నా గౌరవం లేదు…పై పైకి అందరి వాడిని అని చెప్తూ లోలోపల కేవలం కాపులకే పట్టం కడుతున్నాడు అంటూనే పవన్ ని కుల ఉగ్రవాదిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారట. అందుకు అనుగుణంగా కొంతమంది ద్వారా ఒక పక్కా ప్రణాళికగా ముందుకు వెళ్ళే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలద్వారా తెలుస్తోందని జనసేనలో నేతలు అభిప్రాయ పడుతున్నారు..

పశ్చిమలో పవన్ కళ్యాణ్ కి విశేష ఆదరణం పెరిగిపోవడంతో భవిష్యత్తులో తమ కంచుకోటకి ఎక్కడ బీటలు వారుతాయోనని టీడీపీ అధిష్టానానికి బెంగ పట్టుకుందట అందుకే టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు..పవన్ పై వరుసగా మాటల దాడులు చేయిస్తున్నారు.పచ్చని పశ్చిమలో పవన్ గొడవలు రేపుతున్నాడు..పశ్చిమని నాశనం చేస్తున్నాడు అంటూ లేనిపోని మాటలు చెప్తూ ప్రజలని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు…అయితే టీడీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితులో లేరని జనసేన నేతలు ఘంటాపథంగా చెప్తున్నారు.