జనసేన ప్రధాన కార్యదర్శిగా ముత్తంశెట్టి కృష్ణారావు

వాస్తవం ప్రతినిధి: జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పార్టీ కీలక పోస్టుల భర్తీ ప్రారంభించారు. పార్టీలో అత్యంత ముఖ్యమైన ప్రధాన కార్యదర్శిగా ముత్తంశెట్టి కృష్ణారావును నియమించారు. ప్రస్తుతం కృష్ణారావు కృష్ణ, గుంటూరు జిల్లాల సమన్వయకర్తగా పార్టీ వ్యవహరాలు చక్కబెడుతున్నారు. నోవా విద్యాసంస్థల అధినేత ముత్తంశెట్టి కృష్ణారావు. ఈ మేరకు శనివారం ఏలూరులో జరిగిన సభలో పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు. ఏలూరులో పవన్‌ కల్యాణ్‌ను కలసిన కృష్ణారావు ధన్యవాదాలు తెలిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు.