ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్న ప్రతిపక్షాలు

వాస్తవం ప్రతినిధి: యాపిల్‌ కంపెనీలో పని చేసే ఒక ఉద్యోగి వివేక్‌ను కారు ఆపలేదనే కారణంతో పోలీసు కానిస్టేబుల్‌ పిస్టల్‌తో కాల్చి చంపిన ఘటన తెలిసిందే. కాగా ,ఈ ఘటనపై ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. రాష్ట్రంలో ”రాక్షస రాజ్యం” కొనసాగుతోందని ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి చెప్పారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ రాజీనామా చేయాలని అఖిలేష్‌ డిమాండ్‌ చేశారని చౌదరి అన్నారు.

మరోవైపు ఈ ఘటనపై తివారి భార్య కల్పన తీవ్రంగా స్పందించారు. ‘కారు ఆపనంత మాత్రాన కాల్చిచంపేస్తారా? పోలీసులకు ఎవరిచ్చారీ హక్కు? దీనిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సమాధానం చెప్పాలి’ అంటూ ఆమె డిమాండ్‌ చేశారు.