పవన్ కల్యాణ్ రక్షణ బాధ్యత మాదే: ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్

వాస్తవం ప్రతినిధి: తన హత్యకు పథకం పన్నారంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలపై ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పందించారు.జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రక్షణ బాధ్యత మాదే అని ఠాకూర్ తెలిపారు. ఏపీలోని ఐదు కోట్ల మంది ప్రజలకు రక్షణ కల్పిస్తాం.. పవన్ రక్షణ బాధ్యత కూడా తమదేనన్నారు. తన హత్యకు కుట్రపన్నారని చెబుతున్న వారి పేర్లను పవన్ మాకు చెబితే చర్యలు తీసుకుంటామని ఠాకూర్ అన్నారు. పవన్ ఆరోపణలపై ఇప్పటికే ప.గో. జిల్లా ఎస్పీకి సమాచారం అందించాం. పవన్ వద్ద ఆధారాలు తీసుకుని చట్టపరమైన చర్యలు చేపట్టే పనిలో ఉన్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ప్రజలకు ఎటువంటి ఆపద వచ్చినా తమను సంప్రదించాలని డీజీపీ కోరారు.a