అసెంబ్లీ సీట్ల పెంపు ఏ పార్టీకి నష్టం..?

వాస్తవం ప్రతినిధి: అసెంబ్లీ సీట్లు పెంపు చేయాలనే డిమాండ్ బీజేపీ టీడీపీ లు సయోధ్యగా ఉన్న సమయం నుంచీ వస్తున్న ప్రతిపాదనే అయితే ఈ సీట్లని పెంచితే ఎవరికి నష్టం ఎవరికీ లాభం అంటే విషయాలని అంచనా వేసుకుంటే..వెంకయ్యనాయుడు ఉపరాష్త్రపతి కాకముందు అసెంబ్లీ సీట్ల పెంపు విషయంలో ప్రత్యేక శ్రద్ద చూపించేవారు టీడీపీ కూడా  కేంద్రంపై ఈ విషయంలో ఒత్తిడి తీసుకువస్తూ ఉండేది అయితే

నిజానికి బాబు బీజేపీకి బై చెప్పడానికి అతి ముఖ్య కారణం అసెంబ్లీ సీట్ల పెంపు పై కేంద్రం మొండివైఖరిని అవలంభించడం వలెనే..అయితే చాలా కాలం తరువాత ఈ అసెంబ్లీ స్థానాల పెంపు పై మరోమారు వార్తలు వినిపిస్తున్నాయి అసలు స్థానాలని బీజేపీ ప్రభుత్వం పెంచడానికి సిద్దంగా ఉందా లేదా..? అసలు నిజంగా సీట్లు పెరుగుతాయా అంటే నిజమే అంటున్నాయి హస్తిన వర్గాలు..అసెంబ్లీ సీట్ల పెంపునకు సంబంధించి బిల్లు రెడీ అయిందని వచ్చే శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ముందుకు వస్తుందని తెలుస్తోంది.

అయితే ఒక వైపు చూస్తుంటే తెలంగాణాలో ముందస్తు ఎన్నికలకు రంగం సిధ్ధం అవుతుతోంది. మరో వైపు ఏపీ లో టీడీపీ కి బీజేపీ కి చెడింది అయితే ఈ సమయంలో బీజేపీ సీట్ల పెంపు విషయంలో ముందడుగు వేస్తుందా లేదా అంటే పెద్ద డౌట్ అనే చెప్పాలి..ఈ మధ్యనే హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ దీనిపై మాట్లాడుతూ సీట్ల పెంపు కుదరరదని..రాజ్యంగా సవరణ చేయాలని కూడా చెప్పుకొచ్చారు. మరి ఇంతలోనే ఇలా అంటున్నారంటే మళ్ళీ టీడీపీ ని లైన్లో పెట్టుకోవాలనే వ్యుహమా అనే సందేహం అందరిలో కలుగుతోంది.

ఇదిలాఉంటే ఏపీలో ఎన్నికలకి ఇంకా ఏడూ నెలల సమయం ఉంది దాంతో ఏపీలో ఘాటుగా చర్చ సాగుతోంది..సీట్లు పెరిగితే మాత్రం అది ఖచ్చితంగా టీడీపీ కి లాభం చేకూర్చుతుంది అనడంలో సందేహం లేదుఇపుడున్న 175 సీట్లని  225 సీట్లుకు  చేస్తే అదనంగా యాభై సీట్లు వస్తాయి..దాంతో టీడీపీలో పెద్ద ఎత్తున ఉన్న ఆశావాహులకి చోటు కల్పించడమే కాకుండా పార్టీని ముందుకు తీసుకువెళ్లచ్చు అనేది బాబు అంచనా అయితే..అదే సమయంలో పవన కళ్యాణ్ లా యువతకి పెద్ద ఎత్తున సీట్లు ఇచ్చి యూత్ లో క్రేజ్ కొట్టేయాలనేది బాబు ఉద్దేశ్యమట అయితే ఇదే జరిగితే అధికారం కోసం తపిస్తున్న జగన్ మోహన్ రెడ్డికి ఈ సారి కూడా సీఎం కుర్చీ దక్కడం కల్లె అంటున్నారు విశ్లేషకులు.