వెస్టిండీస్ సిరీస్ లో రోహిత్,ధావన్ లపై వేటు

వాస్తవం ప్రతినిధి: అందరి అంచనాలకు తగ్గట్టుగానే ఆసియా కప్ ని దిగ్విజయంగా ముగించింది టీమిండియా. అయితే ఒకపక్క ఇప్పుడే ఆసియాకప్‌ ముగిసిన నేపథ్యంలో క్రికెట్‌ అభిమానుల కళ్లన్నీ ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌ ‌మీదే ఉన్నాయి. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో విఫలమయినా ఆసియాకప్‌లో టీమిండియా ఉత్తమ ప్రదర్శన కనబర్చి.. ఏడోసారి ట్రోఫీని ముద్దాడింది. అయితే ఇంకొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న వెస్టిండీస్‌ టెస్టు సిరీస్‌కు సంబంధించి టీమిండియా జట్టును శనివారం ప్రకటించారు. ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ వెస్టిండీస్‌తో ఆడబోయే ఆటగాళ్ల పేర్లు ప్రకటించింది. అయితే ఈ టెస్టుల్లో ఓపెనర్‌ రోహిత్ శర్మ తో పాటు శిఖర్ ధావన్ కూడా చోటు దక్కకపోవడం విశేషం. దీనిపై గంగూలీ కూడా ట్వీటర్ ద్వారా తీవ్ర అసంతృప్తి వ్యఖ్తం చేశాడు

ఆసియాకప్‌లో మెరుగ్గా రాణించినప్పటికీ ఇంగ్లాండ్‌ పర్యటనలో విఫలమవ్వడంతో అతడిని ఎంపిక చేయలేదు. ఇంగ్లాండ్‌ సిరీస్‌ మధ్యలోనే తుది జట్టుకు దూరమైన మరో ఓపెనర్‌ మురళీ విజయ్‌కి కూడా సెలక్టర్లు అవకాశమివ్వలేదు. అయితే ఈ మ్యాచ్ లో మహ్మద్‌ సిరాజ్‌, పృథ్వీ షా, మయాంక్‌ అగర్వాల్‌లకు చోటు లభించింది.