లక్నో లో షాకింగ్ సంఘటన…కారు ఆపలేదని ఉద్యోగి పై కానిస్టేబుల్ కాల్పులు

వాస్తవం ప్రతినిధి: లక్నో శుక్రవారం అర్థరాత్రి ఓ షాకింగ్‌ సంఘటన చోటు చేసుకుంది. కారు ఆపలేదన్న కారణంగా ఆపిల్‌ కంపెనీకి చెందిన ఓ ఉద్యోగుడిని పోలీసు కానిస్టేబుల్‌ కాల్చేశాడు.  వివేక్‌ తివారి అనే వ్యక్తి, ఐఫోన్‌ కంపెనీలో ఏరియా మేనేజర్‌ గా చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆఫీసు అయిపోయిన తర్వాత తన కారులో ఇంటికి వెళ్తున్న సమయంలో, అతన్ని ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు ఆపారు. అయితే వివేక్‌ వారికి పట్టించుకోకుండా.. తన కారును ఆపకుండా.. అలానే ట్రైవ్‌ చేసుకుంటూ వెళ్లిపోయాడు. వెంటనే వారిలో ఒక పోలీస్‌ కానిస్టేబుల్‌ తన గన్‌ను తీసి, వివేక్‌ పైకి కాల్పులు జరిపడం తో వివేక్‌ మృతిచెందాడు. శుక్రవారం అర్థరాత్రి 1.30 గంటలకు గోమతి నగర్‌ ఎక్స్‌టెన్షన్‌ ఏరియాలో ఈ కాల్పుల సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఆపినా ఆగకుండా.. డ్రైవర్‌ కారును క్రాస్‌ చేసి తీసుకు వెళ్లిపోయాడు. దీంతో అనుమానించిన ఒక పోలీసు కానిస్టేబుల్‌ అతనిపై కాల్పులు జరిపాడు. దీంతో కారు డివైడర్‌కు ఢీకొని, ఆ వ్యక్తి తీవ్ర గాయాలు పాలయ్యాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించాం. కానీ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు తెలిసింది’ అని లక్నో డీఎస్పీ తెలిపారు. అయితే శవ పరీక్ష రిపోర్టులు వచ్చాక, అవసరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్‌పీ చెప్పారు. అయితే ఒకవేళ పోస్టు మార్టమ్‌ రిపోర్టులు ఆ మరణం, పోలీసు అధికారి జరిపిన బుల్లెట్‌ కాల్పుల వల్లేనని తెలిస్తే, అది హత్యానేరంగానే పరిగణించనున్నట్లు తెలిపారు.