జగన్ పాదయాత్ర @ 273వ రోజు

వాస్తవం ప్రతినిధి: ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ… ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ సాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహర్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర 273వ రోజుకు చేరింది… నేడు గజపతినగరం నియోజకవర్గంలోకి వైఎస్ జగన్ అడుగుపెట్టారు. జిద్దేటి వలస క్రాస్, గొడికొమ్ము, అలమందక్రాస్, అలమంద సంత, లోట్లపల్లి క్రాస్, కొత్త భీమ సింగి మీదుగా పాతభీమసింగి వరకు ఈ రోజు పాదయాత్ర కొనసాగనుంది.