స్మార్ట్ ఫోన్లు పక్కన పెట్టకపోతే పిల్లలు మానసికంగా కృంగి పోతారు…మిచిగాన్ యూనివర్సిటీ హెచ్చరిక

వాస్తవం పతినిధి: స్మార్ట్ ఫోన్లు పక్కన పెట్టకపోతే పిల్లలు మానసికంగా కృంగి పోతారని మిచిగాన్ యూనివర్సిటీ హెచ్చరించింది. దాదాపు 60 శాతం తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ లు గంటల తరబడి వినియోగిస్తూ తమపిల్లలని పట్టించుకోకపోతే వారి మానసిక పరివర్తన తీవ్రంగా మారటమేకాక,సైకాలజికల్ డిసార్డర్స్ వస్తాయని అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీ హెచ్చరించింది.ఇటీవల చేసిన పరిశోధనలో తల్లి దండ్రులు గంటలతరబడి చూసే ఆ ఫోన్ లో ఏముందన్న ఉత్సాహం తో వారుకూడా ఫోన్లను వాడేందుకు చొరవ చూపుతారన్నారని కూడా యూనివర్సిటీ హెచ్చరించింది.
కాగా స్మార్ట్ ఫోన్లతో కాలక్షేపం చేస్తూ ప్రక్కన ఉన్న తమను పట్టించుకోని తలిదండ్రులతో తాము ప్రేమను కోల్పోయి ,తమ సమస్యలను చెప్పుకోలేక పోతున్నామని ఇటీవల న్యూయార్క్ లో బాలలు రక రకాల నినాదాలు వ్రాసిన ప్లే కార్డులు పట్టుకుని ర్యాలీ జరిపారు.
తమతలిదండ్రుల ప్రేమ కావాలని,తమ ఆలనా పాలన సక్రమంగా చూడలని అందుకు వారు ఫోన్లను తక్కువగా వినియోగించాలని కూడా ప్లే కార్డు లపై రాసి ర్యాలీ చెయ్యటం పట్ల పిల్లలు తమ తలిదండ్రుల ఫోన్ వినియోగం తో ఎంత విసిగి పోయారో తేటతెల్లం అవుతోందని నిపుణులు పేర్కొంటున్నారు