అమెరికా మిలిటరీ కి భారీ షాక్!

వాస్తవం ప్రతినిధి: అమెరికా మిలిటరీకి భారీ షాక్ తగిలింది. అత్యంత అధునాతన ఫైటర్ జెట్ ఎఫ్-35 నేలకూలినట్లు తెలుస్తుంది. దక్షిణ కరోలినా రాష్ట్రంలో ఎఫ్-35బీ కూలినట్లు మెరైన్ కార్ప్స్ తాజాగా ప్రకటించింది. అయితే ఈ ప్రమాదంలో ఆ ఫైటర్ జెట్ పైలట్ సురక్షితంగా ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తుంది. ఎఫ్-35 కూలిన ఘటన పట్ల విచారణ చేపడుతున్నట్లు మెరైన్స్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఫైటర్ జెట్లలో.. ఎఫ్-35 అత్యంత ఖరీదైనది. అమెరికా ఈ యుద్ధ విమానాలను తయారు చేసేందుకు ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టింది. సుమారు మూడు వేల ఫైటర్లను సమీకరించాలని అమెరికా భావిస్తున్నది. ఫైటర్ జెట్ కూలిన ప్రాంతం నుంచి దట్టమైన పొగ వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. షార్ట్ టేకాఫ్‌లు, వర్టికల్ ల్యాండింగ్స్‌కు.. ఎఫ్35బీకి ప్రత్యేక గుర్తింపు ఉన్నది.