రష్యా అధ్యక్షుడి కి గిఫ్ట్ గా మిగ్-21

వాస్తవం ప్రతినిధి: అక్టోబర్ లో భారత్ రానున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు భారత్ ఒక కానుక ఇవ్వనుందట. ఇంతకీ ఆ కానుక ఏమిటంటే మిగ్-21 యుద్ధ విమానాలను భారత్ బహూకరించనున్నది. మొత్తం మూడు మిగ్-21 విమనాలను గిఫ్ట్‌గా ఇచ్చేందుకు భారత్ ఏర్పాట్లు చేస్తుంది. మూడు మిగ్‌లు ఇవ్వాలంటూ రష్యా రక్షణ మంత్రి చేసిన అభ్యర్థన మేరకు భారత్ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక, రక్షణ ఒప్పందం బలంగా ఉందన్న సంకేతాన్ని ఇచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. వాస్తవానికి మిగ్ యుద్ధ విమానాలను సోవియెట్ రష్యానే తయారు చేసింది. రష్యన్ టెక్నాలజీ తయారైన మిగ్ విమానాలే భారత వైమానిక దళంలో ఉన్నాయి. భారత ఎయిర్‌ఫోర్స్ వద్ద ఇంకా 121 మిగ్ విమానాలు ఉన్నాయి. అయితే అందులోని టైప్ 75, టైప్ 77 విమానాలను రష్యాకు గిఫ్ట్‌గా ఇవ్వనున్నట్లు తెలిసింది.