ఏడోసారి ఆసియా కప్ ని ముద్దాడిన టీమిండియా

వాస్తవం ప్రతినిధి: టీమిండియా ఏడోసారి ఆసియా కప్ ని ముద్దాడింది. విరాట్ కోహ్లీ ఆసియా కప్ లో లేకపోవడం తో సారధ్య భాద్యతలు చేపట్టిన రోహిత్ శర్మ సారధ్య భాద్యతలు చేపట్టి జట్టుకు విజయాలను అందించాడు. దీనితో టీమిండియా ఆటగాళ్ల పై పలువురు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. ఆసియా కప్ లో భారత్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. అయితే అందరి అంచనాలకు తగ్గట్లుగానే  రోహిత్‌ సేన ప్రదర్శన చూపింది. శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠభరిత తుదిపోరులో విజయం భారత్‌నే వరించింది. అయితే ఈ కప్‌లో భాగంగా కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ అద్భుతమైన తీరు కనబరిచాడని కోచ్‌ రవిశాస్త్రి పొగడ్తలతో ముంచెత్తారు. శుక్రవారం రాత్రి ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ విజయం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రోహిత్‌ నెమ్మదితనం, చాకచక్యంతో అతడు తన కెప్టెన్సీ బాధ్యతలను ఎంతో బాగా నిర్వర్తించాడు. ప్రతిమ్యాచ్‌లోనూ రోహిత్‌ అనుసరించిన వ్యూహాలు అద్భుతం. ఆసియా కప్‌లో భాగంగా మొదట భారత్‌-హాంగ్‌కాంగ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నాడో ఫైనల్‌లో బంగ్లాదేశ్‌తోనూ అవే అనుసరించాడు అని,ఇది నిజానికి చాలా గొప్ప విషయం అని శాస్త్రీ వ్యాఖ్యానించారు.  ప్రత్యర్థుల పరిస్థితులను బట్టి జట్టును మలచడం చాలా కొద్ది మంది మాత్రమే అనుసరించే ట్రిక్‌, అయితే ఈ విషయంలో రోహిత్‌ సఫలమయ్యాడు అని రవి శాస్త్రీ ప్రసంశలు కురిపించారు