ధోనీ బ్యాటింగ్ లో మునుపటి స్పీడు కన్పించడం లేదు!

వాస్తవం ప్రతినిధి: టీమ్‌ ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్‌లో మునుపటి స్పీడు కనిపించడం లేదని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయ పడ్డారు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో తన ఉనికిని చాటినప్పటికీ అంతర్జాతీయ క్రికెట్‌ల్‌ మాత్రం కాస్త వెనకబడిపోతున్నారని కావున ధోని దేశవాళీ క్రికెట్‌ ఆడితే మునపటి ఫామ్‌ను అందుకోవచ్చని విశ్వాసం వ్యక్తం వేశారు. ‘ధోని కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాలి. నాలుగు రోజుల గేమ్స్‌ ఆడాలి. 50 ఓవరల్లో అంతగా అవకాశాలుండవు. నాలుగు రోజుల ఆట వల్ల సుదీర్ఘమైన ఇన్నింగ్స్‌ ఆడొచ్చు. దానివల్ల ఆటలో మునపటి రిథమ్‌ వస్తుంది. అలాగే ఝార్ఖండ్ నుంచి కొత్తగా క్రికెట్లోకి వచ్చే ఆటగాళ్లకు ధోని ఉపయోగడతాడు అని సన్నీ కొన్ని సూచనలు చేశారు.