టీ-20 ప్రపంచ కప్ కు సారధి గా హార్మన్ ప్రీత్

వాస్తవం ప్రతినిధి: నవంబరులో జరగనున్న ఐసీసీ ఉమెన్స్‌ టీ20 వరల్డ్‌ కప్‌లో భాగంగా భారత మహిళా జట్టుకు హర్మన్‌ ప్రీత్ కౌర్‌ సారథ్యం వహించనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు శుక్రవారం బీసీసీఐ 15మంది క్రికెటర్ల పేర్లను ప్రకటిస్తూ వెల్లడించింది. నవంబర్‌ 9 నుంచి 24 వరకు జరిగే ఈ క్రీడలకు వెస్టిండీస్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. హర్మన్‌ ప్రీత్‌ను కెప్టెన్‌గా, స్మృతి మందానను వైస్‌ కెప్టెన్‌గా బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ క్రీడల్లో భాగంగా ఇండియా గ్రూప్‌-బీలో ఆడనుంది. భారత్‌తో పాటు గ్రూప్‌-బీలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, ఐర్లాండ్‌ జట్లు ఆడనున్నాయి. తొలిరోజు భారత్‌.. న్యూజిలాండ్‌తో తలపడనుంది. ‘గ్రూప్‌-ఏ’లో డిపెండింగ్‌ ఛాంపియన్స్‌, ఆతిథ్య వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్‌ జట్లు ఉన్నాయి.