అమెరికాలో ‘ నవాబ్’ సంచలనం

వాస్తవం సినిమా: తమిళంలో మణిరత్నం దర్శకత్వం వహించిన ‘చక్క చివంత వానమ్’ .. ‘నవాబ్’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అరవిందస్వామి .. శింబు .. విజయ్ సేతుపతి .. అరుణ్ విజయ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, వాళ్ల సరసన కథానాయికలుగా జ్యోతిక .. అదితీ రావు .. ఐశ్వర్య రాజేశ్ నటించారు. తమిళనాట మాత్రమే కాదు, అమెరికాలోను ఈ సినిమాకి అనూహ్యమైన స్పందన వస్తోంది.

మాఫియా నేపథ్యంలో అన్నదమ్ముల మధ్య సాగే పోరాటంగా ఈ కథ తెరకెక్కింది. కథలోని కొత్తదనం వలన .. కథనంలోని ఆసక్తి కారణంగా ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తోంది. తొలిరోజున ఈ సినిమా భారీ వసూళ్లనే రాబట్టినట్టుగా చెబుతున్నారు. అమెరికాలో తొలిరోజున ఈ సినిమా 1.25 కోట్లను వసూలు చేయడం విశేషమేనని అంటున్నారు. బలమైన కథాకథనాలు ..బలమైన తారాగణం ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లను తెచ్చిపెట్టాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.