అరవింద సమేత అఫీషియల్ అనౌన్స్ మెంట్

aravinda sametha audio function cancel

వాస్తవం సినిమా: ఎన్టీఆర్ -త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా’అరవింద సమేత వీర రాఘవ ‘ చిత్రాన్ని అక్టోబర్ 11న విడుదల చేస్తున్నాం అంటూ అధికారికంగా ప్రకటించారు ఆ చిత్ర బృందం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం అరవింద సమేత వీర రాఘవ . త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది , మరోవైపున పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దాంతో అక్టోబర్11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నామని ప్రకటించారు. ఎన్టీఆర్ సరసన హాట్ భామ పూజా హెగ్డే నటించగా ఈషా రెబ్బా కీలక పాత్రలో నటించింది.

జగపతిబాబు, నాగబాబు లతో పాటుగా సునీల్ కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ అరవింద సమేత పై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్ , ట్రైలర్ లతో ఆ అంచనాలు మరింతగా పెరిగాయి.