విజయ్ ఖాతాలో అంతర్జాతీయ అవార్డు

వాస్తవం సినిమా: ఇటీవల విజయ్ సినిమాల జోరు బాగా పెంచాడు. విజయ్ సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో మంచి విజయాలను నమోదు చేసుకుంటున్నాయి. తుపాకీ, కత్తి, మెర్సల్ ఇలా వరస విజయాలతో విజయ్ దూసుకుపోతున్నాడు. ఇప్పుడు మురుగదాస్ తో సర్కార్ చేస్తున్నారు. ఈ సినిమా దీపావళి కానుకగా విడుదల కాబోతున్నది. ఇప్పటికే సర్కార్ పై పాజిటివ్ బజ్ నడుస్తున్నది.
మరోవైపు విజయ్ ఖాతాలో మరో అద్భుతమైన అవార్డు వచ్చి చేరింది. అంతర్జాతీయంగా రాణించిన స్టార్స్ కు ఐరా అవార్డులను ప్రజెంట్ చేస్తారు. ఐరా కేటగిరిలో ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది నటులు పోటీ పడ్డారు. ఇందులో విజయ్ అంతర్జాతీయ నటుడు కేటగిరిలో నామినేట్ అయ్యాడు. అంతర్జాతీయంగా పోటీ ఉన్నప్పటికీ విజయ్ వారిని పక్కకు నెట్టి అవార్డును సొంతం చేసుకోవడం విశేషం.