సర్జికల్ దాడి ప్రధాని మోదీ సాహసోపేత నిర్ణయం: దల్బీర్ సింగ్  

వాస్తవం ప్రతినిధి: రెండేళ్ల క్రితం కాశ్మీర్ సరిహద్దుల్లో జరిగిన సర్జికల్ దాడిపై.. రిటైర్డ్ ఆర్మీ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ తాజాగా మాట్లాడారు.  సర్జికల్ దాడి నిర్వహించాలని తాము చేసిన సూచనను ప్రధాని మోదీ స్వీకరించినట్లు ఆయన గుర్తు చేశారు. సర్జికల్ దాడి.. ప్రధాని మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయమని ఆయన వ్యాఖ్యానించారు. 2016, సెప్టెంబర్ 27వ తేదీన .. భారత సైనిక దళాలు.. ఎల్వోసీ దాటి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న ఉగ్ర స్థావరాలను తుదముట్టించిన సంగతి తెలిసిందే. యురిలో భారత సైనిక శిబిరంపై జరిగిన దాడికి ప్రతీకారంగా ఈ సర్జికల్ దాడులు నిర్వహించారు.