కాశ్మీర్ లో త్రివర్ణ పతకానికి అవమానం

వాస్తవం ప్రతినిధి: కాశ్మీర్‌లో త్రివర్ణ ప‌తాకానికి అవమానం జరిగింది. ఒక బీజేపీ నేత చేపట్టిన ర్యాలీ లో త్రివర్ణ పతకానికి అవమానం జరిగింది.  బీజేపీ నేత రాజీవ్ జస్రోటియా చేపట్టిన ర్యాలీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ర్యాలీ సమయంలో జాతీయ జెండాను తలకిందులుగా ప్రదర్శించారు. దీనితో ఈ ఘటన పట్ల పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కథువా పోలీసు స్టేషన్‌లో గుర్తు తెలియనివారిపై ఈ ఫిర్యాదు నమోదైంది. లోకల్ ఎన్నికల కోసం నామినేషన్ వేసేందుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే పక్కన ఉన్న ఓ వ్యక్తి జాతీయ జెండాను తలకిందులుగా పట్టుకున్న వీడియోను పోలీసులకు అందజేశారు. ఈ ఘటన దేశభక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని ఓ స్థానికుడు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.