లోకేష్ మళ్ళీ “పప్పు” లో కాలేశాడా..?..అయ్యో అయ్యో అయ్యయ్యో..!!!

 వాస్తవం ప్రతినిధి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారాల పుత్రుడు ఏపీ ఐటీ శాఖామంత్రి అయిన లోకేష్ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం లో టీడీపీ తలపెట్టిన ధర్మపోరాట దీక్షలో చెలరేగిపోయారు..లోకేష్ స్పీడు చూసి సొంత పార్టీనేతలకి దిమ్మతిరిగిపోయిందట..ఇదేంటి లోకేష్ బాబు గుక్కతిప్పుకోకుండా అంత అనర్గళంగా మాట్లాడుతున్నాడని ఆలోచనలో పడ్డారట అయితే ఈ గుక్కతిప్పుడు ప్రసంగం వెనుక అసలు మేటర్ ఏమిటంటే పవన్ పై ఫైర్ అవ్వాలని గడిచిన రెండు మూడు రోజుల  నుంచీ స్క్రిప్ట్  సిద్దం చేసుకున్నాడట..

ఇంతకీ ఎందుకా అంతటి ప్రేపరేషణ్ అంటే…పశ్చిమలో పవన్ కళ్యాణ్ టూర్ ఉంది అయితే పవన్ కి ధీటుగా మాట్లాడాలనే ఉద్దేశ్యంతో తెగ కుస్తీ పట్లు పట్టాడట ఆ స్క్రిప్ట్ తో సరే ఇవన్ని బాగానే ఉన్నాయి కానీ ఎప్పటిలాగానే లోకేష్ బాబు పప్పులో కాలేశాడు..నెటిజన్ల తో పాటు పార్టీలో సీనియర్స్ కోపానికి కారణం అయ్యాడు..ఇంతకీ ఏమి జరిగిందని ఆలోచిస్తున్నారా అసల విషయం చెప్పకుండా ఇంతటి ఉపోద్ఘాతము ఎందుకంటారా సరే అసలు విషయంలోకి వెళ్తే..

టీడీపీ ధర్మపోరాట దీక్షలో లోకేష్ కేంద్రం పై మండిపడ్డారు..ఎపీకి కేంద్రం చేసిన అన్యాయంపై దిక్కులు పెక్కటిల్లేలా ఫైర్ అయ్యారు..అరరే ఏపీ అంటే ఎంతటి ప్రేమాభిమానాలు అనుకుంటున్నారా సరే అంతటి శ్రద్ద ఎపీపై ఉంటే ఏపీ అభివృద్దిపై ఉంటే గడిచిన నాలుగేళ్ల క్రితం వరకూ కూడా లోకేష్ బాబు ఏమి చేశారు ఏపీ ముఖ్యమంత్రి ఏమి చేశారు అంటే కేంద్రం చుట్టా ప్రదక్షిణాలు చేశామనే మాటలు వస్తాయి…కానీ ఇప్పుడు లోకేష్ బాబు కి చంద్రబాబు కి పెగిలే గొంతు అప్పుడు ఎందుకు పెగలలేదు అనేదానికి రీజన్ అందరికి తెలిసిందే అయితే…

లోకేష్ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు…కనీసం మైకు కూడా సరిగా పట్టుకోవడం రాని  లోకేష్… పవన్ పై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు`..జగన్ పవన్ లకి ఓటేస్తే బీజేపీ కి ఓటు వేసినట్టేనని చెప్పడం వలన మీ డొల్ల తనం బయటపడుతోందని తెలిపారు.. ఏపీలో కాంగ్రెస్ అంటే ఇష్టం లేని  ప్రజలు కాంగ్రెస్ ని చిత్తు చిత్తుగా ఓడించాలని డిసైడ్ అయ్యారు..అయితే  అలాంటి సమయంలో టీడీపీ పార్టీ తెలంగాణలో కేసీఆర్ ని ఓడించడానికి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది మరి అలాంటప్పుడు ఏపీలో టీడీపీ కి ఓటేస్తే కాంగ్రెస్ కి ఓటేసినట్టేనని భావించాలా చెప్పండి లోకేష్ గారు అంటూ నెటిజన్లు తెగ ఫైర్ అవుతున్నారు. దాంతో టీడీపీ సీనియర్స్ లోకేష్ పై లోలోపల తిట్టిపోస్తున్నారట. ఒక వేలు ఒకరివైపు చూపిస్తే మిగలిన వెళ్ళు మనవైపే చూపిస్తాయని చినబాబు కి తెలియదు కాబోలు అంటూ తెగ సెటైర్స్ వేస్తున్నారట.