పవన్ కళ్యాణ్ కు ఎవరిపై అనుమానం ఉందో బయటకు చెప్పాలి : చంద్రబాబు

వాస్తవం ప్రతినిధి: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు ప్రాణహాని ఉంటే పోలీసులు రక్షణ కల్పిస్తారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కు చంపుతారని ఎవరిపైన అనుమానం ఉన్నా బయటకు చెప్పాలని సూచించారు. పవన్‌ రక్షణ బాధ్యత పోలీసులు తీసుకుంటారని తెలిపారు. నేరాలు, నేర చరిత్రను ప్రోత్సహించే సమస్యే లేదని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పోలీసు వ్యవస్థపై అందరికీ నమ్మకం ఉండాలని, రాష్ట్రంలో ఫ్యాక్షన్‌ నియంత్రించామని తెలిపారు. ప్రతి శుక్రవారం జైలుకు వెళ్లే వ్యక్తిని ఎన్డీఏ కాపాడుతుందని ఆరోపించారు. ప్రధాని మోడీ క్రెడిబిలిటీ పూర్తిగా పోయిందని విమర్శించారు చంద్రాబాబు. మోడి చెప్పేవి ఏమీ ఇంప్లిమెంట్ చెయ్యరని చంద్రబాబు ఆరోపించారు.