ఏలూరులో ఉపాధ్యాయులు, న్యాయవాదులతో సమావేశం కానున్న పవన్ కళ్యాణ్

 వాస్తవం ప్రతినిధి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడిలో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ప్రస్తుతం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన నేడు ఏలూరులో న్యాయవాదులు, ఉపాధ్యాయులతో సమావేశం అవుతారు. అనంతరం చింతలపూడిలోని లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని పరిశీలించి, సాయంత్రం నాలుగు గంటలకు గ్రామంలో భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. రాత్రికి జంగారెడ్డి గూడెంలో బస చేస్తారు. కాగా, పవన్ గత రెండు రోజులుగా టీడీపీ ప్రభుత్వంపైనా, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని పైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. అలాగే, తాను ముఖ్యమంత్రిని అయితే చేపట్టబోయే కార్యక్రమాల గురించి కూడా వివరిస్తూ ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు.