హీరోగా తెరంగేట్రం చేస్తున్నవిజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ

వాస్తవం సినిమా: అర్జున్‌ రెడ్డి తో స్టార్‌ స్టేటస్‌ను దక్కించుకున్న విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు. గత కొన్ని రోజులుగా ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ఫిలిం నగర్ తాజా సమాచారం ప్రకారం ఆనంద్‌ దేవరకొండ మరియు రాజశేఖర్‌ చిన్న కూతురు శివాత్మిక జంటగా ఒక చిత్రంకు రంగం సిద్దం అయ్యింది. కేవీఆర్‌ మహేంద్ర దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ ఈ చిత్రం రూపొందబోతుంది. ఈ మహేంద్ర ఎన్నో షార్ట్‌ ఫిల్మ్స్‌తో ప్రేక్షకులను అలరించాడు. మంచి స్క్రిప్ట్‌తో పాటు ఒక మంచి కథను ఈయన రాసుకోవడంతో రాజశేఖర్‌ మరియు విజయ్‌ దేవరకొండలు ఆ కథను నచ్చారు. త్వరలోనే ఈ చిత్రంను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రాజశేఖర్‌ పెద్ద కూతురు శివానీ ఇటీవలే తెరంగేట్రం చేసింది. ఆమె నటించిన సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. మరో వైపు విజయ్‌ దేవరకొండ తమ్ముడు అంటూ ఆనంద్‌కు మంచి క్రేజ్‌ దక్కింది. ఈ నేపథ్యంలో వీరిద్దరు కలిసి నటించబోతున్న చిత్రాలు భారీ విజయాన్ని దక్కించుకోవడం ఖాయం.