విమానానికి తప్పిన పెను ప్రమాదం!

వాస్తవం ప్రతినిధి: మైక్రోనేషియన్ ద్వీపంలో ఒక విమానానికి పెను ప్రమాదం తప్పింది. 47 మందితో వెళ్తున్న ఆ విమానం త్రుటి లో ప్రమాదాన్ని తప్పించుకుంది. దీనితో ఆ విమానంలోని ప్రయాణికులు అందరూ క్షేమంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే……మైక్రోనేషియన్‌ ద్వీపంలోని ఓ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం న్యుగిని విమానం ల్యాండ్‌ అవుతున్న సమయంలో రన్‌వే నుండి జారి పడి పక్కనే ఉన్న సముద్రంలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఎవరికీ తీవ్రగాయాలు కాలేదు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. దక్షిణ ఫసిపిక్‌ దేశమైన మైక్రోనేషియాలోని వెనో ద్వీపంలో చుక్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పపువా న్యూ గినియా నుండి బయలు దేరిన న్యూగిని విమానం వెనోలోని విమానాశ్రయంలో ల్యాండ్‌ అయ్యే సమయంలో రన్‌వే నుంచి జారిపడిన విమానం పక్కనే ఉన్న సముద్రపు కొలనులోకి దూసుకెళ్లింది. అయితే ఆ చెరువు లోతుగా లేకపోవడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. 36 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బందిని చిన్న పడవల సాయంతో అధికారులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని ఎయిర్‌పోర్టు సిబ్బంది తెలిపారు.