సౌదీ లో చాలా గౌరవప్రదమైన పనులు చేసిన లాడెన్ కుటుంబం

Light trails from traffic illuminate highways surrounded by residential buildings in Riyadh, Saudi Arabia, on Friday, Jan. 8, 2016. Saudi Arabian stocks led Gulf Arab markets lower after oil extended its slump from the lowest close since 2004. Photographer: Waseem Obaidi/Bloomberg

వాస్తవం ప్రతినిధి: ఒకప్పుడు అగ్రరాజ్యం అమెరికాను గడగడలాడించిన కరుడు గట్టిన ఉగ్రావాది బిన్‌ లాడెన్‌. బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులతో ఎంతోమంది అమాయక ప్రజల ప్రాణాలను పొట్టన బెట్టుకున్నాడు. అయితే అలాంటి లాడెన్‌ కుటుంబసభ్యులు చాలా గౌరవప్రదమైన పనులు చేశారని సౌదీ మీడియా తెలిపింది. ఆయన తండ్రి మొహమ్మద్‌ సౌదీ అరేబియా రాజుకు అత్యంత సన్నిహితులట. అంతేకాదు.. లాడెన్‌ కుటుంబం సౌదీ అరేబియాలోని రోడ్లు, మసీదులు, ప్యాలెస్‌లు కూడా నిర్మించింది అని అక్కడి మీడియా పేర్కొంది.  లాడెన్ తండ్రి యెమన్ నుంచి సౌదీ కి వెళ్లి 1931లో ఓ చిన్న నిర్మాణ కంపెనీని/ ప్రారంభించారు. అప్పటి సౌదీ రాజు అబ్దులాజిజ్‌ లాడెన్‌ తండ్రికి ఎన్నో కాంట్రాక్టులు కూడా ఇచ్చారట. ఆయన కోసం మొహమ్మద్‌ కేవలం 20 రోజుల్లోనే ఓ ప్యాలెస్‌ను నిర్మించారట. సౌదీ రాజుకు సంబంధించిన అన్ని నిర్మాణ కాంట్రాక్టులు ఎక్కువగా లాడెన్‌ కుటుంబానికే వచ్చాయి. మొహమ్మద్‌ బిన్‌ లాడెన్‌ కుటుంబం చాలా పెద్దది. 70 మంది పిల్లలు, డజన్ల మంది భార్యలు ఉండేవారు. మొహమ్మద్‌ మరణానంతరం కూడా ఆయన పిల్లలు, మనవళ్లు సౌదీ రాజుతో కలిసి పని చేశారు. సౌదీ బిన్‌లాడెన్‌ గ్రూప్‌కు కొన్ని కోట్ల విలువ చేసే ప్రాజెక్టుల కాంట్రాక్టులు వచ్చేవి. జెడ్డాలో వాళ్లు ఓ విమానాశ్రయాన్ని నిర్మించేందుకు పని చేశారు. సౌదీ రాజుకు సంబంధించిన అత్యంత సున్నితమైన ప్రాజక్టులన్నింటినీ లాడెన్‌ కుటుంబమే దగ్గరుండి చూసుకుంది. లాడెన్‌ సోదరులు బక్ర్‌, సలాహ్‌, సాద్‌లు కూడా సౌదీ రాజ వంశీయులకు నమ్మకస్థులుగా ఉండేవారు. అత్యంత తక్కువ సమయంలో నిర్మాణాలు పూర్తి చేసేందుకు సౌదీ బిన్‌లాడెన్‌ గ్రూప్‌ రష్‌ ప్రాజెక్ట్‌ పేరుమీద ఓ డివిజన్‌ను ఏర్పాటు చేసింది. ఇది ప్రభుత్వం కోసం మాత్రమే పని చేస్తుంది. ఇందులో భాగంగా జెడ్డాలో సౌదీ కింగ్‌ అబ్దుల్లా కోసం ప్రత్యేకంగా కొత్త ప్యాలెస్‌ను నిర్మించారు. వారసత్వంగా వస్తూ వచ్చిన లాడెన్‌ కంపెనీ ఏడాది క్రితం వరకు బాగానే పని చేసింది. కానీ నవంబరు 4, 2017లో సౌదీ ప్రభుత్వం చేపట్టిన అవినీతి వ్యతిరేక చర్యల్లో భాగంగా ఆ కంపెనీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.