రష్యా, చైనా ల మధ్య వేగంగా పెరుగుతున్న వాణిజ్య టర్నోవర్

వాస్తవం ప్రతినిధి: రష్యా, చైనా మధ్య వాణిజ్య టర్నోవర్‌ వేగంగా పెరిగినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపాడు. ఈ ఏడాది 10వేల కోట్ల డాలర్లకు చేరుకుంటుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే ఆరేళ్ళలో రెట్టింపు చేయాలని కూడా రష్యా భావిస్తున్నట్లు పుతిన్ తెలిపారు. చైనాతో రష్యా వాణిజ్యాన్ని 200 బిలియన్ల డాలర్లకు పెంచాలని యోచిస్తున్నాం. రష్యా ఆర్థిక వ్యవస్థలో చైనా పెట్టుబడులు 1500కోట్ల డాలర్ల వరకు వుంటాయని రష్యా ప్రభుత్వ కార్యకలాపాలకు చెందిన డాక్యుమెంట్‌ పేర్కొంది. గురువారం విడుదల చేసిన ఈ పత్రం ఇతర దేశాలతో రష్యా వాణిజ్యం పెంపు గురించి కూడా పేర్కొంది. 2024 నాటికి భారత్‌తో రష్యా వాణిజ్యం 3వేల కోట్ల డాలర్లకు చేరగలదని భావిస్తున్నారు.