దేవరకొండ దూకుడు మామూలుగా లేదండోయ్..

వాసవం సినిమా: విజయ్ దేవరకొండ దూకుడు మామూలుగా లేదు. విజయ్ హీరోగా  రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాగా రూపుదిద్దుకొని తమిళ – తెలుగుభాషల్లో ‘నోటా’ సినిమా ముస్తాబైంది.
అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో విజయ్ దేవరకొండ చొరవ తీసుకుని మరీ తనదైన దూకుడు చూపిస్తున్నాడు. ఇప్పటికే తమిళనాట ప్రమోషన్స్ ను పూర్తి చేసిన ఆయన, తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టిని ఈ సినిమా వైపుకి తిప్పడానికి తనదైన స్టైల్లో ప్రయత్నిస్తున్నాడు.

‘ది నోటా పబ్లిక్ మీట్’ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో రెండు ఈవెంట్స్ ను జరపడానికి సన్నాహాలు చేశాడు. ఈ నెల 30వ తేదీన విజయవాడ – బెంజ్ సర్కిల్లోని ‘ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్’లో ఒక ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఇక మరొక ఈవెంట్ ను అక్టోబర్ 1వ తేదీన హైదరాబాద్ .. యూసఫ్ గూడాలోని ‘కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం’లో నిర్వహించనున్నారు. భారీస్థాయిలో ప్లాన్ చేసిన ఈవెంట్స్ ఈ సినిమా సక్సెస్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతాయనేది చూడాలి.