పాతికేళ్ల క్రితం సినిమా సీక్వెల్ కు సిద్దమవుతున్న కమల్

వాస్తవం సినిమా: కమల్‌ నటప్రస్థానంలో ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే భారతీయుడు చిత్రానికి కొనసాగింపుగా పార్ట్‌ 2 నిర్మించే సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి కూడా శంకర్‌ దర్శకత్వం వహిస్తారు. భారతీయుడు సినిమాకి సీకెల్ ఉంటుందని కమల్‌ సైతం వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం తాజాగా మరో సీక్వెల్‌ సినిమాకు కమల్‌ ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం.
పాతికేళ్ల క్రితం కమల్‌ నటించగా వచ్చిన చిత్రం తేవర్‌ మగన్‌ (తెలుగులో క్షత్రియ పుత్రుడు). ఈ చిత్రానికి కమల్‌ స్క్రిప్ట్‌ అందించారు. ఆయన సోదరుడు చంద్రహాసన్‌తో కలిసి నిర్మించారు. ఇతర పాత్రల్లో శివాజీ గణేషన్‌, రేవతి, గౌతమి నటించారు. మంచి విజయం సాధించిన ఈ చిత్రానికి పార్ట్‌ 2 తీసే ఉద్దేశంతో కమల్‌ ఉన్నట్టుగా తెలిసింది. పాతికేళ్ళ తర్వాత కూడా సీక్వెల్‌ తీసే ఆయన ఆలోచన ఆశ్చర్యం కలిగిస్తున్నప్పటికీ, ఈ వార్త ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు.