పొలిటికల్ బ్యాక్డ్రాప్” లో..చిరంజీవి భారీ సినిమా

వాస్తవం సినిమా: మెగా అభిమానులకి ఈ న్యూస్ ఎంతో సంతోషాన్ని ఇస్తుందనే చెప్పాలి..చిరంజీవి త్వరలో ఓ భారీ బడ్జెట్ పొలిటికల్ బ్యాక్డ్రాప్ చిత్రంలో నటించనున్నాడట ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ లో హల్చల్ చేస్తోంది..చాలా గ్యాప్ తరువాత రాజకీయాలపై చిరు తీసుకున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయట. రాజకీయాల నుంచీ కొంచ గ్యాప్ తీసుకుని చిరు నటించిన ఖైదీ నెం 150 చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో వేరే చెప్పనవసరం లేదు అయితే

చిరు ప్రస్తుతం తన 151 వ చిత్రం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంతో బిజీ బిజీగా ఉన్నారు…ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి..అయితే ఈ సినిమా తరువాత చిరు 152వ సినిమా పై దృష్టి పెట్టనున్నారట.. అయితే పొలిటికల్ సినిమాలని ఈ మధ్యకాలంలో ఎంతో వైవిధ్యభరితమైన అంశంతో తెరకెక్కించి సక్సెస్ అవుతున్న కొరటాల శివ కి చిరు దర్శకత్వ భాద్యతలు అప్పగించారని తెలుస్తోంది

అయితే ఈ సినిమా కోసం కొరటాల తమన్నాని హీరొయిన్ గా ఎంపిక కూడా చేసేశారట.. తమన్నా గతంలో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి మెగా హీరోలతో జతకట్టింది. తాజాగా ఆమె పేరు చిరంజీవి సినిమాకు వినిపిస్తుండటం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది…అయితే కొరటాల –చిరు సినిమా రాజకీయ కోణంతో అదికూడా ప్రస్తుత పరిస్థితులకి అనుగుణంగా రానున్నాడని తెలియడంతో ఈ సినిమాపై ఇప్పటినుంచే భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు.