నన్ను చంపేస్తారు..పవన్ షాకింగ్ కామెంట్స్..!!!

వాస్తవం ప్రతినిధి: పవన్ కళ్యాణ్ పై హత్యాయత్నం జరుగుతుందా..? పవన్ పై హత్య కుట్ర వెనుక ఏమి జరుగుతోంది..? ఇప్పటికే ఈ కుట్రకి వ్యుహలని సిద్దం చేశారా..? ఈ కుట్రలో కీలకమైన ముగ్గురు వ్యక్తులు పాలు పంచుకుంటున్నారా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి..అయితే ఈ వ్యాఖ్యలు చేసింది ఈ సందేహాలు వ్యక్తం చేసింది ఎవరో కాదు సాక్షాత్తు జనసేన అధినేత పవన్ కళ్యాణ్..పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పవన్ దెందులూరు నియోజకవర్గంలో పర్యటన చేశారు ఈ క్రమంలో చింతమనేని ఆగడాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు చంద్రబాబు కి లోకేష్ కి చింతమనేని విషయంలో కొన్ని సూచనలు కూడా చేశారు..అయితే

మరుసటి రోజున పవన్ కళ్యాణ్ ఏలూరు భహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై విమర్శలని చేస్తూ వచ్చారు అక్కడ కూడా చింతమనేని ఆగడాలపై పవన్ స్థానిక ఎమ్మెల్యే బడేటి బుజ్జి ని నిలదీశారు..మీకు చింతమనేని అంటే చంద్రబాబులానే భయమా చెప్పండి అన్ని ఫైర్ అయ్యారు…జనసేన సైనికులకు అధికార పక్షం నుంచి ఇటు ప్రతిపక్షం నుంచి బెదిరింపులు వస్తున్నాయని, దయచేసి అటువంటి పనులను మానుకోవాలని హితువు పలికారు.

అంతేకాదు మా జనసేన పార్టీ ని “ఎలక్షన్ కమిషన్” దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. మాకు సహనం ఉంది, కాబట్టి భరిస్తాం, సహిస్తాం. అవసరమైతే కాళ్ళు విరగొట్టి కూర్చోబెడతాం..అంటూ తనదైన శైలిలో మండిపడ్డారు. ఇదిలాఉంటే పవన్ మాట్లాడుతూ మొన్న ఎవరెవరో చేసిన సర్వేలో 2 శాతం అని, లగడపాటి రాజగోపాల్ సర్వేలో5 శాతం అని చెప్పారు. మరి ఆ 5- 10 శాతం చూసి ఎందుకు భయపడుతున్నారు. రేపు మీరు అధికారంలోకి రావాలన్న, ప్రతిపక్షం అధికారంలోకి రావాలన్న సరే మేమే నిర్ణయించాలి గుర్తు పెట్టుకోండి అంటూ వ్యాఖ్యలు చేశారు పవన్.

ఈ క్రమంలోనే పవన్ సంచలన విషయాలు బయట పెట్టారు.. అదేంటంటే..నన్ను చంపేయాలనుకుంటున్నారు.“ముగ్గురు క్రిమినల్స్” నన్ను చంపేస్తే అసలు సమస్య ఉండదని లెక్కలు వేస్తున్నారు…వారు మాట్లాడుకున్న వాయిస్ క్లిప్ నావరకూ వచ్చింది వాళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు వారు పేర్లు కూడా నాకు తెలుసు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్..నన్ను చంపేసి అధికార, ప్రతిపక్షాలు ఒకరిమీద ఒకరు తోసుకుని అడ్డు తొలగించుకోవాలని.. భయపెట్టాలని చూస్తున్నారని అన్నారు.

అయితే ఈ వ్యాఖ్యలు అనంతరం అదే రోజు రాత్రి పవన్ బస చేస్తున్న క్రాంతి కళ్యాణమండపం దగ్గరకి వచ్చి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు చింతమనేని ఫోటో ఉన్న బైకులు వేసుకువచ్చి పవన్ కి వ్యతిరేకంగా అరుస్తూ అక్కడ తిరుగుతూ హల్చల్ చేశారు పవన్ అభిమానుల అప్రమత్తతతో వారు పారి పోవడం జరిగింది..ఈ విషయం తెలుసుకున్న విజయవాడ ,ఏలూరు పరిసర ప్రాంత కార్యక్రాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని పవన్ కి అండగా ఉంటామని అరాచక శక్తులకి హెచ్చరికలు జారీ చేశారు..