జంట హత్యల కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

వాస్తవం ప్రతినిధి: ఢిల్లీ పోలీసులు జంట హత్యల కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గతేడాది జులై 15 న రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో ఓ ఆస్తి వివాదంలో గుడ్డు అనే వ్యక్తి రామ్‌వీర్, చంద్రు అనే ఇద్దరు వ్యక్తులను హత్య చేశాడు. అయితే ఈ హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుడు గుడ్డు గత సంవత్సర కాలంగా దక్షిణ ఢిల్లీలోని ఛాతర్‌పూర్‌లో నివాసముంటున్నట్లు గుర్తించిన అధికారులు  గురువారం నిందితుడు గుడ్డు ఆర్‌కే పురంలో తన సోదరుడిని కలిసేందుకు వస్తున్నట్లు సమాచారమందడం తో అక్కడే అతడిని అరెస్ట్ చేసినట్లు అక్కడి డీఎస్పీ దేవేంద్ర ఆర్య వెల్లడించారు.