గీతా ఆర్ట్స్ నుంచి మరో ప్రేమకథా చిత్రం

వాస్తవం సినిమా: టాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థగా పేరున్న గీత ఆర్ట్స్ ఇటీవల కాలంలో టాలెంట్ ఉన్న దర్శకులను నటీనటులకు ఎక్కువగా అవకాశాలు కల్పిస్తోంది. పెద్ద సినిమాలు నిర్మించి కొద్దీ పాటి లాభాలతో సతమతమయ్యే కన్నా చిన్న చిత్రాలను నిర్మించి ఎక్కువ మొత్తంలో షేర్స్ అందుకోవడం బెటర్ అని లెక్కలు వేసుకుంటున్నారు.
ఇటీవల గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన ‘గీత గోవిందం’ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. కొత్త కోణంలో ఆవిష్కరించబడిన ఈ ప్రేమకథా చిత్రం సరికొత్త ట్రెండ్ ను సృష్టించింది. చాలా తక్కువ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, భారీ లాభాలను తెచ్చిపెట్టింది. దాంతో మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ ను నిర్మించడానికి గీతా ఆర్ట్స్ వారు రెడీ అవుతున్నారు.

ఈ సినిమాలో కథానాయకుడిగా నాగశౌర్యను ఎంపిక చేసుకున్నారు. కథానాయిక ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. తక్కువ బడ్జెట్ లోనే చేసే ఈ సినిమాను ఓ యువదర్శకుడికి అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కథా చర్చలు చివరి దశకి చేరుకున్నాయనీ, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.