కరీం నగర్ లో దారుణ ఘటన!

knife in a blood pool isolated on white

వాస్తవం ప్రతినిధి: కరీంనగర్ జిల్లాలోని అల్గునూర్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వివాహితమహిళ కవితపై అదే గ్రామానికి చెందిన యువకుడు రాజేశ్ కత్తితో దాడి చేసినట్లు తెలుస్తుంది. అయితే తొలుత ఆమెపై దాడికి దిగన అతడు అనంతరం తనను తాను పోడుచుకున్నాడు. అయితే దీనిని గమనించిన స్థానికులు ఇద్దరినీ కరీం నగర్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీనితో గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.