ఈ మధ్య కాలంలో ఇంత చెత్తగా ఆడడం ఇదే: అఫ్రిది

వాస్తవం ప్రతినిధి: పాక్ ఇంత చెత్త గా ఈ మధ్య కాలంలో ఇదే అని పాకిస్తాన్ జట్టు మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది అన్నాడు. అయితే పాకిస్థాన్‌ జట్టుకు దూకుడు లేకే ఆసియాకప్‌ నుంచి నిష్క్రమించాల్సి వచ్చిందని అఫ్రిది అన్నాడు. ఈ మధ్య కాలంలో పాక్ జట్టు ఈ విధంగా ఆడడం,మరీ ముఖ్యంగా బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్‌లో ఓడడం ఇంకా నిరాశపరిచింది అని అఫ్రిది అన్నారు. అయితే ఆసియా కప్ ఫైనల్‌ చేరినందుకు బంగ్లాకు అభినందనలు. గత కొన్ని టోర్నీల్లో పాక్‌ యువ జట్టు బాగానే ఆడింది. దీంతో జట్టుపై అంచనాలు పెరిగాయి. కానీ ఆసియాకప్‌లో ఓటమి స్వయంకృపరాథమే. ప్రాక్టీస్‌తోనే తప్పులు దిద్దుకుని మళ్లీ బలంగా పుంజుకునే అవకాశం ఉంటుంది’’ అని అఫ్రిది అన్నాడు. బంగ్లాదేశ్‌తో సూపర్‌-4 మ్యాచ్‌లో పాక్‌ 37 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. చిరకాల ప్రత్యర్థి భారత్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పాక్‌ చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే.