ఉత్తర ప్రదేశ్ లో విషాద సంఘటన!

వాస్తవం ప్రతినిధి: ఉత్తరప్రదేశ్‌లో విషాద సంఘటన చోటుచేసుకుంది. ప్లాస్టిక్ ఉత్పత్తులు తయారు చేసే పరిశ్రమలో ప్రమాద వశాత్తు జరిగిన ప్రమాదంలో 25 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నోయిడా లోని ప్లాస్టిక్ ఉత్పత్తులు తయారు చేసే పరిశ్రమలో బుధవారం చోటుచేసుకుంది. మిషన్‌ను శుభ్రపరుస్తుండగా ఎవరో ఓ వ్యక్తి స్విచ్ ఆన్ చేయడంతో ఆ మిషన్ బ్లేడ్‌లలో చిక్కుకుని సదరు యువకుడు మృతిచెందినట్లు తెలుస్తుంది. బాధితుడి సోదురుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరు వ్యక్తులపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటువంటే ఘటనే ఇటీవలి కాలంలో ఎటా జిల్లాలో కూడా చోటుచేసుకుంది. పశుగ్రాసం కత్తిరించే మిషన్‌లో చీర చిక్కుకోవడంతో మహిళ మిషన్ కోతకు గురై చనిపోయిన సంగతి తెలిసిందే.