అక్టోబర్‌లో 13 ప్రాంతాలలో శ్రీనివాస కల్యాణాలు

వాస్తవం ప్రతినిధి: టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో అక్టోబర్‌ 2 నుండి 26వ తేదీ వరకు అనంతపురం జిల్లాలో 6 ప్రాంతాలలో, చిత్తూరు జిల్లాలో 6 ప్రాంతాలలో, కర్నూలు జిల్లా ఒకచోట శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నట్లు తితిదే ప్రకటన జారీ చేసింది.

అనంతపురం జిల్లా:

– అక్టోబర్‌ 2వ తేదీన వజ్రకరూర్‌ మండలం, పుట్టిపాడు గ్రామంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

– అక్టోబర్‌ 4న ఉరవకొండ మండలం, లత్తవరం తాండాలో స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు.

– అక్టోబర్‌ 5న బ్రహ్మసముద్రం మండలం, పాలవెంకటాపురం గ్రామంలోని శ్రీవారి కల్యాణం జరుగనుంది.

– అక్టోబర్‌ 6న పుట్టపర్తి మండల కేంద్రంలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు.

– అక్టోబర్‌ 7న యాడికి మండలం కోనుప్పలపాడు గ్రామంలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.

– అక్టోబర్‌ 8న నార్పల మండలం, మాలవాడ్లపల్లి గ్రామంలో స్వామివారి కల్యాణం జరుగనుంది.

చిత్తూరు జిల్లా:

– అక్టోబర్‌ 6న కుప్పం మండలం, ఊర్లోబానపల్లి గ్రామంలోని శ్రీ బేతరాయస్వామి వారి ఆలయ ప్రాంగణంలో స్వామివారి కల్యాణం జరుగనుంది.

– అక్టోబర్‌ 21న వి.కోట మండలం, మద్దిరాల గ్రామం పరిధిలోని ఎస్టీ కాలనీలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.

– అక్టోబర్‌ 22న శాంతిపురం మండలం, 121 పేడూరులో స్వామివారి కల్యాణం జరుగనుంది.

– అక్టోబర్‌ 23న గంగవరం మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్‌ ప్రాంగణంలో స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు.

– అక్టోబర్‌ 24న యాదమరి మండలం, బండివాళ్లవూరు క్రాస్‌ గ్రామంలో స్వామివారి కల్యాణం జరుగనుంది.

– అక్టోబర్‌ 25 ఐరాల మండల కేంద్రాంలోని జడ్పీ హైస్కూల్‌ ప్రాంగణంలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.

– అక్టోబర్‌ 26న పెనుమూరు మండలం, బత్తివంక గ్రామంలో స్వామివారి కల్యాణం జరుగనుంది.

కర్నూలు జిల్లా:

– అక్టోబర్‌ 3న పత్తికొండ మండల కేంద్రంలో స్వామివారి కల్యాణం జరుగనుంది.

అక్టోబర్‌ 6న చిత్తూరు జిల్లా కుప్పం మండలం ఊర్లోబానపల్లిలో జరిగే శ్రీవారి కల్యాణం ఉదయం 10 గంటలకు, మిగిలిన ప్రాంతాలలో అన్నిచోట్లా సాయంత్రం 6 గంటలకు కల్యాణాలు ప్రారంభంకానున్నాయి.