పొదుపు మంత్రం లో భాగంగా గేదెలను అమ్మిన పాక్ ప్రధాని

వాస్తవం ప్రతినిధి: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పొదుపు  మంత్రం జపిస్తూ తీసుకుంటున్న చర్యలు అధికారులకు తల నొప్పిగా మారుతున్నాయి. దేశంలో లోటు బడ్జెట్‌, ఆర్థిక సమస్యలు ఉన్నాయంటూ అత్యంత ఖరీదైన, విలాసవంతమైన వస్తువులను ఇటీవల వేలానికి పెట్టిన విషయం తెలిసిందే. లోటు బడ్జెట్‌ను పూడ్చుకోవడానికి ఇమ్రాన్‌ పొదుపు బాట పట్టారు. ఇందులో భాగంగా ప్రధాని నివాసంలోని ఎనిమిది గేదెలను గురువారం వేలం వేశారు. దీని ద్వారా రూ.23 లక్షలు సేకరించారని ఆ దేశ మీడియా తెలిపింది. ఇందులో ఓ గేదె అత్యధికంగా రూ.3,85,000లకు అమ్ముడు పోయింది. మిగిలిన గేదెలను ఇమ్రాన్‌ సొంత పార్టీ పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఈ-ఇన్సాఫ్‌(పీటీఐ) కార్యకర్తలు కొనుక్కున్నారు. మొన్నటి వరకు ప్రధాన మంత్రి నివాసంలోని వాహనాల ను వేలం వేసిన ఆయన

ఇప్పుడు ఇంట్లోని పశువులను కూడా అమ్మకానికి పెట్టడంతో ప్రతిపక్షాలు ఇమ్రాన్‌ ఖాన్‌పై మండిపడుతున్నాయి. పొదుపు మంత్రం పేరుతో వీటిని వేలానికి పెట్టి ఈ డబ్బును ఇమ్రాన్‌ ఖాన్‌ తన విలాసాలకు ఖర్చు చేసుకుంటున్నారంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నా